Poets

ప్రకృతి పర్యంతమూ / natürlich bis

ప్రకృతి పర్యంతమూ
Sie benötigen den Flashplayer , um dieses Video zu sehen

ఆకులన్నీ  రాలాకా  వచ్చే  తొలి చిగురు 
  నీ  ఉద్రేకం లాంటిది !
    ముద్దు తర్వాత 
    చర్మం మీద  కమిలిన  ముద్ర లాగానే 
    మెత్తగా ఎర్రబడుతుంది  ! 

    నిన్ను గుర్తు చేస్తూ 
    సీమచింత  చెట్టు మీద  పంచవన్నె పక్షులు 
    వసంతాన్ని తెస్తాయి ! 
    నాలో  పాత జ్ఞాపకాలు 
    నారింజవాసనలతో వీస్తాయి !! 

   నీరెండ పడిన  తడి ఆకుల్లో 
   నీ  నవ్వు తళతళలను  చూసి ఎగిసి 
   కాసిన్ని కిరణాలను  వడిసి పడతాను !
   ఉన్మత్తంగా చల్లగాలి వెంట పరుగు పెడతాను 
   స్వర్ణసముద్రంలోకి 
   సూర్యుడినావ మీద బయలుదేరి 
   ద్వీప ద్వీపాల నించి 
   స్వప్న సుగంధాలెన్నో సేకరిస్తాను ! 

   ఏదీ ?
   ఎంత వెతికినా  ఎన్ని ఉదయాలు గడిచినా 
   నువ్వెక్కడా కనిపించవేం ? 
   అనేక మలుపులతో 
   జానపదగాధకు మల్లే  
   నా ముందుకొస్తావు కాబోలు ! 

   సంచారజీవనం లాంటి  నీ సాహచర్యంలో 
   నాకు స్థిమితమూ  ఉండదు 
   స్థిరత్వమూ  ఉండదు 

   అయినా సరే ! 
   మృదువుగా ఒకసారి 
   మహోధృతంగా ఒకసారి  
   నేను జీవనదిగా  కొనసాగుతాను ! 
   ప్రకృతి  పర్యంతమూ... 
   నీ జాడ కోసం ! 

Jayaprabha
natürlich bis

alle blätter abgeworfen sind und neue
treiben wie deine leidenschaft aus
der wundgeküssten, rotliebkosten haut.
blutrote, pflaumenblaue, eigelbe, grüne
weiße vögel setzt das frühjahr zur erinnerung
an dich auf den tamarindenbaum, erinnerung
ist der duftstoff der narinja.
im feuchten laub, im stängel licht
blitzt lachen, deins, und ich geh strahlen
fischen mit dem sonnenboot
zu den inselfähren, windbetriebene
traumpflückerin, duftjägerin, dichsucherin. wo
du morgen für morgen nicht erscheinst.
oder irgendwann dastehst
wie der wendepunkt einer geschichte.
das leben mit dir kommt nicht an
bis


Translation: Sylvia Geist und Tom Schulz

 

Biography Jayaprabha

More poems

కల /
Ein Traum


బాధ /
Schmerz


యశోధరా ఈ వగపెందుకే ! /
Was soll die Wut, Yashodhara?